90 ఆనందం – 100 ఆశ: గ్రేటర్ లో “కారు” తేలిపోనుందా?

-

ఇప్పటివరకూ తెలంగాణ ఎన్నిక ఏదైనా అధికార పార్టీనే విజయం వరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతం ఓట్లతో కవిత సాధించిన ఘన విజయం ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్! ఈ ఊపులో గ్రేటర్ ఎన్నికలకు సిద్ధపడుతుంది టీఆర్ఎస్! అయితే ఇప్పుడు ఆ ఉత్సాహం నీరుగారిపోతుందని, ఊపు తగ్గిందని చెబుతున్నారు విశ్లేషకులు!

గ్రేటర్ లో 100 నుంచి 105 కార్పొరేషన్ సీట్లు తమకే అని అధికారపార్టీ కాన్ఫిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే! అయితే ఈ ఉత్సాహం మూడు రోజుల కిందటి మాట! అవును… అధికారపార్టీకి కాన్ఫిడెంట్స్ ని, గులాబీ నేతల్లో ఉన్న ఉత్సాహాన్ని వరుణుడు తొక్కేశాడు! తమ బలం అధికంగా గ్రేటర్ లో అని నమ్మే కేటీఆర్ కి తాజాగా గ్రేటర్ లో పడిన వర్షాలు కాన్ఫిడెంన్స్ ని చంపేశాయని చెబుతున్నారు!

అవును… మిగిలిన రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా, ఎన్నిక వచ్చినా హరీష్ రావుకి బాధ్యతలు అప్పగించే తెరాస పెద్దలు.. గ్రేటర్ విషయంలో మాత్రం కేటీఆర్ నే ఉపయోగిస్తున్నారు! దీంతో ఈ సారి కూడా గ్రేటర్ ఫలితాలు కేటీఆర్ ఫెర్ఫార్మెన్స్ కు ఉదాహరణగా నిలవనున్నాయి! అయితే.. మరో నెలలో గ్రేటర్ ఎన్నికల హడావుడి ప్రారంభమయ్యే వేళలో.. తాజా భారీ వర్షం కారణంగా భాగ్యనగర వాసుల జీవనం అస్తవ్యస్తం అయ్యింది!

విశ్వనగరంగా మార్చాము అని చెప్పుకునే భాగ్యనగరంలోని లోపాలు అన్నీ కుప్పలా బయటకు రావటంతో.. హైదరాబాద్ కోసం అధికారపార్టీ ఏమి చేసిందో ఎన్నికల్లో బలంగా చెప్పుకోలేని పరిస్థితి! అక్కడక్కడా రోడ్లేశాం, గోడలకు రంగులేశాం అని మాత్రం చెప్పుకుంటే సరిపోదన్న విషయం ప్రస్తుతం తెరాస నేతలకు బలంగా అర్ధం అయ్యిందంట! ఫైనల్ గా… వర్షం తెచ్చిన వరదతో గ్రేటర్ లో “కారు” తేలిపోనుందనే కామెంట్లు, గులాబీ నేతల మాటలను నిశితంగా పరిశీలిస్తే అర్ధం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Latest news