విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి అల్వాకు TRS మద్దతు

-

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఉప రాష్ట్రపతి పదవి కి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా (Margaret Alva) కు మద్దతునివ్వాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయం మేరకు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు మొత్తం 16 మంది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనను విడుదల చేశారు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విపక్షాల అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. కాగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా విపక్షాల అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది.

Read more RELATED
Recommended to you

Latest news