అలెర్ట్… రెండు రోజులు నిలిచిపోనున్న ప్రభుత్వ ఆన్‌లైన్‌ సేవలు

-

తెలంగాణలో రెండు రోజులు ప్రభుత్వ ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనున్నాయి. జూలై 9 (శుక్రవారం) రాత్రి 9 గంటల నుంచి 11వ తేది (ఆదివారం) రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రభుత్వ వెబ్‌సైట్లు పని చేయవని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (స్టేట్ డేటా సెంటర్-ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్‌ యూనిట్‌ ఏర్పాటు దృష్ట్యా ఈ అంతరాయం కలగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆన్‌లైన్‌ సేవలు /online services
ఆన్‌లైన్‌ సేవలు /online services

కాగా తెలంగాణలో రాష్ట్ర డేటా కేంద్రం ద్వారా ప్రభుత్వ వెబ్‌సైట్ల ఆన్‌లైన్‌ సేవలు కొనసాగుతునాయి. అయితే దాదాపు అన్ని సేవలు ఆన్‌లైన్‌ ద్వారా అందించడంతో ఈ సేవల వినియోగం పెరుగుతుండగా మరో వైపు విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో విద్యుత్‌ అంతరాయాలకు చెక్ పెట్టె దిశగా ప్రస్తుతం ఉన్న యూపీఎస్‌ స్థాయిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త యూపీఎస్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనుండడంతో ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని శాఖలకు సమాచారం అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news