ఆర్టీసీ దండుగా అన్నారు.. ఇకపై ఆర్టీసీ పండగే అవుతుంది – తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్

-

వ్యవసాయం దండుగా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారు…ఆర్టీసీ దండుగా అన్నారు.. ఇకపై ఆర్టీసీ పండగే అవుతుందని తెలిపారు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. ఆర్టీసీ ఛైర్మెన్, ఎండీగా మమ్మల్ని పెట్టడంతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తాడని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని.. ఆర్టీసీ పని కథం అని అన్నారు, కానీ మేము ఛాలెంజింగా తీసుకున్నామని వెల్లడించారు.

ఇప్పుడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఆర్టీసీ విరజిల్లుతుందని.. ఎండీ ఏ నిర్ణయం తీసుకున్న నేను కళ్ళు మూసుకొని సంతకం పెడ్తున్నానని చెప్పారు. నేను వ్యక్తిని నమ్మితే పని సక్రమంగా చేస్తానని.. కొన్ని ఛాలెంజింగ్ సమస్యలతో పని చేస్తే ఫలితం అదే స్థాయిలో ఉందని వివరించారు. ఆర్టీసీలో ఇప్పుడు జీతాలు 11 శాతం పెరిగాయి. ఇంకో డీఏ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

గతంలో 97 డిపోల నష్టాల్లో ఉన్నాయి కానీ, ఇప్పుడు 20 డిపోల్లో లాభాల్లో దూసుకెళ్తున్నాయి… రాబోయే రోజుల్లో 1000 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.అనేక రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళింది.. అయిన మనం ఛాలెంజ్ గా తీసుకొని ఆర్టీసీని బ్రతికిస్తున్నామన్నారు. బస్సులు ఖాళీ ఉండొద్దు, ఖాళీగా ఉన్న బస్సు నడవద్దు… ఉద్యోగుల సమస్యలు వినండి, ఉద్యోగుల పట్ల మర్యాదగా ఉండండని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news