కరీంనగర్‌లో టీటీడీ ఆలయం, రూ.20 కోట్లతో శంకుస్థాపన

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త. కరీంనగర్ జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరనున్నాడు. ఈ మేరకు ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను అందజేశారు టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.

ఈ నెల 31న ఉదయం 7గం.26 నిమిషాలకు వేదమంత్రోచ్ఛారణలతో టీటీడీ ఆలయ భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. అదే ప్రాంగణంలో సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం కూడా జరుపనున్నారు. 10 ఎకరాల్లో 20 కోట్లతో కరీంనగర్లో అత్యంత సుందరంగా శ్రీవారి ఆలయం నిర్మాణం జరుగనుంది. సీఎం కేసీఆర్ చేయూత, మంత్రి గంగుల కమలాకర్ పట్టుదల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కృషితో కరీంనగర్లో కొలువుదీరనున్నారు శ్రీవారు.