బ్యాంక్ ఖాతా డియాక్టివేట్ అయ్యిందా..? ఇలా పునరుద్ధరించుకోండి..!

-

ఇండియా లో బ్యాంకింగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా వుంది. ఈరోజుల్లో ఆన్‌లైన్, యూపీఐ పేమెంట్స్, ఏటీఎం సేవలు వంటివి బాగా ఎక్కువ అయ్యాయి. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ ఖాతా తప్పని సరి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ట్రాన్సక్షన్స్ ని పొందాలన్నా బ్యాంకు ఖాతా తప్పని సరి. అయితే భారతదేశంలో ఉన్న విస్తృతమైన బ్యాంకుల వల్ల ప్రతి వ్యక్తి కి బ్యాంకు అకౌంట్ ఉండడం పరిపాటిగా మారింది. ఎన్ని అకౌంట్స్ వున్నాకూడా కొన్నే మనం వాడుతూ ఉంటాము. దానితో కొన్ని ఖాతాలు ఆటోమెటిక్‌గా డియాక్టివ్ అయిపోతాయి.

ఇక అలా అయినా అకౌంట్స్ మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం.. బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్ అయ్యిందంటే ఇలా మళ్ళీ తిరిగి పొందవచ్చు. ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు కనుక ఆ బ్యాంక్ ఖాతాలో పడితే ఇక ఆ డబ్బులు పొందేందుకు కుదరదు. కాబట్టి ఇలా డియాక్టివ్ అయిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించుకోవచ్చు. డియాక్టివేషన్ ప్రక్రియ తక్షణమే జరగదు. ఎందుకంటే బ్యాంకులు కస్టమర్‌లకు సందేశాలు లేదా కాల్‌ల ద్వారా నోటిఫికేషన్‌ను ఇస్తూ ఉంటాయి. అలా ఖాతాలను మరోసారి యాక్టివేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

వివిధ రకాల ఖాతాలకు నిర్దిష్ట నియమాలు వర్తిస్తాయని గమనించాలి. యాక్టివేషన్ ప్రక్రియను కొనసాగించే ముందు కొన్ని రూల్స్ ని అయితే పాటించాల్సి వుంది. ఇన్‌యాక్టివ్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి బ్యాంకు కి వెళ్లాల్సి వుంది. కేవైసీ ప్రక్రియను తప్పని సరిగా చేయించుకోవాలి. కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తులు నిష్క్రియ ఖాతాల లో జమ చేసిన నిధులను యాక్సెస్ చెయ్యవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లేదా మొబైల్ బ్యాంకింగ్ వంటి అనేక ఇతర బ్యాంకింగ్ సేవలను మీరు ఉపయోగించుకోవచ్చు.
నిష్క్రియ ఖాతా అవసరం లేకపోతే పూర్తిగా మూసివేసే అవకాశం కూడా ఉంది. సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news