గద్దర్ కి పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత అద్దంకి దయాకర్ స్పందించారు. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను తాము
ఖండిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే బుద్దిస్ట్ అయిన గద్దర్ మీకు మావోయిస్టుగానే కనబడ్డారా అంటూ బండి సంజయ్ ను ఆయన ప్రశ్నించారు. అలాగే గద్దర్ తెలంగాణ ఉద్యమకారుడు.. దళిత ప్రజా ఉద్యమకారుడిగా కనిపించలేదా అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని అద్దంకి దయాకర్ నిలదీశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది.
ఈ అవార్డుల్లో తాము పంపిన పేర్లలో గద్దర్ వంటి నేతలకు పద్మ అవార్డు ప్రకటించకపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఇష్యూపై త్వరలో కేంద్రానికి తాము లేఖ రాస్తామని ప్రకటించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గద్దర్ కి పద్మ అవార్డు ఇవ్వాలన్న ప్రభుత్వ డిమాండ్ ను కొట్టిపడేశాడు. తెలంగాణ రాష్ట్ర పోలీసులను, అమాయకులను, బీజేపీ నేతలతో పాటు టీడీపీ, కాంగ్రెస్ వాళ్లను కూడా కాల్చి చంపాడు గద్దర్. మవోయిస్టు నేతలకు సపోర్టుగా నిలిచిన గద్దర్ కు ఎలా ఇస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.