పార్లమెంట్ ప్రవాస్ యోజన లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మూడు రోజులపాటు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల మేధావులతో జ్యోతిరాధిత్యాసిందిగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నేడు మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తీరుగమనంలో ఉందని, అవినీతి తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని ఆరోపించారు. బిజెపి హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. అయినా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని సింథియా మండిపడ్డారు. కాగా ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్ళనున్నారు.