కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు వమ్ము చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయామని పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని ఏమయ్యాయని ప్రశ్నించారు. దళిత బంధు ఉందో లేదో తెలియదు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు ఈ పది నెలల్లో వడ్డీలు ఎంత కట్టారు..? అసలు ఎంత కట్టారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
రైతు బంధు ఇవ్వడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామని చెప్పి ఇంత వరకు పెంచలేదని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంలో ఉందన్నారు. యువతకు నిరుద్యోగ భృతి గురించి ఇంకా సీఎం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. మూసీ భూములు ఎంత అమ్మాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి పై పదినెలల కాలంలో జరిగిన అప్పుల పై, ఇంకా చేయాలనుకుంటున్న అప్పులపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.