హైదరాబాద్‌లో నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 7 గంటల సమయంలో ప్రారంభమైన ఈ భారీ వర్షం.. అర్థ రాత్రి వరకు కొనసాగింది.దీంతో రోడ్లపైకి నీరు..చేరింది. అటు పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాదు.. ఎర్ర గడ్డ ప్రాంతంలో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.
టూవీలర్, ఆటోలు సైతం ఈ వరదలో కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, హైదరాబాద్ లో పలుచోట్ల నిన్న భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. బాలానగర్ 10.4cm, బొల్లారం 9.6cm, తిరుమల గిరి 9.5cm, వెస్ట్ మరేడుపల్లి 9.3cm, కుత్బుల్లాపూర్ 9.2cm, కూకట్ పల్లి 7.7 cm, ముసాపేట 7.6cm, కొండాపూర్ 7.4cm, మొండా మార్కెట్ 7.2cm, మల్కాజిగిరి 7cm వర్షపాతం నమోదు అయింది.
#WATCH | Hyderabad: A person in the Borabanda area along with his two-wheeler washed away, rescued by locals, as heavy rain lashes the city pic.twitter.com/kbTpef43jt
— ANI (@ANI) October 12, 2022
4 wheelers, 3 wheelers and several 2 wheelers washed away in Borabanda and Yousufguda after continuous rain since last couple of hours. Roads, residences submerged in water in few places. #HyderabadRains #Hyderabad pic.twitter.com/4FrElF0KgB
— Inspired Ashu. (@Apniduniyama) October 12, 2022