బెదిరింపులు, దాడులకు భయపడమని విజయశాంతి అన్నారు. కేసీఆర్ సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి. అందుకే రాష్ట్రంలో అరాచక ప్రభుత్వ పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. వీరి పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజల అసహ్యించుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రాకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు.
పైగా ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిపై టీఆర్ఎస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాములమ్మ చెప్పారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటు. ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నానని విజయశాంతి వెల్లడించారు.