మూసీ నిర్వాసితుల కోసం అన్నీ వసతులతో కూడిన రెసిడెన్షియల్స్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా హైటెక్ సిటీలో నిర్వహించిన ఓ ప్రాపర్టీ షో కి భట్టి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసం పని చేస్తుందని.. ఇందులో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మూసీ నిర్వాసితుల కోసం నది సమీపంలోనే రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్మించే ఈ రెసిడెన్షియల్ టవర్స్ లో అన్ని సౌకర్యాలుంటాయని తెలిపారు. అలాగే మూసీ నది నిర్వాసితులకు పాఠశాలలు, మహిళా, స్వయం సహాయక సంఘాలు, చిన్న తరహాలో వ్యాపార అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే.. మూసీ సుందరీకరణపేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఉన్న ఇంటిని లాక్కొని వేరే వద్ద ఇళ్లు ఇస్తామనడం ఎంత వరకు సాధ్యమని మూసీ బాధితులతో కలిసి ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.