నేడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఐఎం కు భయపడే జాతీయ సమైక్యత దినోత్సవం లో నిజాం ఆకృత్యాల గురించి కెసిఆర్ మాట్లాడలేదని అన్నారు. నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధులను విస్కరించిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో గిరిజన సమస్యలపై తెగించి కొట్లాడి జైలు పాలైంది బిజెపి నేతలేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బిజెపికి వస్తున్న స్పందన చూసి కేసిఆర్ గజగజ వనికిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, కమ్యూనిస్టు, ఎంఐఎం పార్టీలు అన్ని ఏకమై వచ్చిన తమ పార్టీని ఏం చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర బిజెపిదని.. నయా నిజం కాసిం చంద్రశేఖర రజ్వి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామన్నారు.