పవిత్ర పుణ్యక్షేత్రం వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉన్న తిరుపతిలో రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తిరుపతి అసెంబ్లీలో ఎప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో అర్ధం కాకుండా ఉంటుంది..1983లో ఇక్కడ టీడీపీ నుంచి ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచారు. 1985, 1989 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది..1994, 1999 ఎన్నికల్లో టీడీపీ గెలవగా, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గెలిచారు.
కానీ తర్వాత ఆయన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేసి..రాజ్యసభ తీసుకుని కేంద్రమంత్రి అయ్యారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2012 ఉపఎన్నికలో తిరుపతి నుంచి వైసీపీ తరుపున భూమన కరుణాకర్ రెడీ గెలిచారు. 2014లో టీడీపీ తరుపున వెంకటరమణ గెలిచారు. ఆయన చనిపోవడంతో 2015లో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో వెంకటరమణ భార్య సుగుణమ్మ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో భూమన కేవలం 708 ఓట్ల మెజారిటీతో సుగుణమ్మపై గెలిచారు.
ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు..ఆయన రాజకీయంగా ఇంకా బలపడినట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో ఇటు టీడీపీ వీక్ అవుతుంది. టీడీపీ నాయకురాలు సుగుణమ్మ అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా ఇక్కడ టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. దీంతో నెక్స్ట్ ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో మళ్ళీ తిరుపతిలో వైసీపీనే గెలిచే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేల్లో వెల్లడైంది.
అయితే ఇక్కడ వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని అర్ధమవుతుంది. కానీ నెక్స్ట్ టీడీపీ-జనసేన కలిస్తే మాత్రం ఇక్కడ వైసీపీకి ఇబ్బంది. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 12 వేల ఓట్లు వరకు పడ్డాయి. అలాంటప్పుడు రెండు పార్టీల పొత్తు వైసీపీకి రిస్క్ అవుతుంది. మొత్తానికి తిరుపతిలో వైసీపీని నిలువరించాలంటే పవన్…టీడీపీతో కలవాలి.