ధరణి స్థానంలో ఆధునిక యాప్ తెస్తాం : రేవంత్ రెడ్డి

-

ధరణి పోర్టల్ బీఆర్ఎస్ కి ఏటీఎంలా మారిందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో ఆధునిక యాప్ ని తీసుకొచ్చి.. మరింత మెరుగైన వ్యవస్థను అందజేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపించినట్టయితే.. తాను నామినేషన్ వేయను అని సవాల్ విసిరారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను సంపత్ కుమార్ తాను తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కేసీఆర్ కి చీమూ నెత్తురు ఉంటే నేను 3 గంటలు లేదా 5 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినట్టు నిరూపించాలన్నారు రేవంత్ రెడ్డి. అసలు రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటలకే కరెంట్ ఇస్తానని తాను చెప్పినట్టు కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జోగులాంబ ఆలయాన్ని కేసీఆర్ 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. కానీ అంతగా అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news