అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – మంత్రి గంగుల

-

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్. ఎఫ్సీఐ విధానాల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు జరుగుతాయన్నారు. వరి ధాన్యం తేమశాతం 17 లోపు ఉంటేనే కొంటామన్నారు. రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు. 20% తేమ ఉన్నా తీసుకోవాలని కేంద్ర సంస్థను కోరినట్లు తెలిపారు. కేంద్ర ఫసల్ బీమా యోజనతో ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు గంగుల కమలాకర్. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

అన్నదాతలకు ఏమాత్రం ఇబ్బందులు రానివ్వబోమన్నారు. జోరు వానలోనూ వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 5 వేల కేంద్రాలను ప్రారంభించి 4 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్, బిజెపి పాలనలో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని అయినా ప్రారంభించారా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news