ఇండియా కూటమిలో ఒక్కో ఏడాదికి ఒక్కో ప్రధాని అని ప్రచారం జరుగుతోంది.. ఒక్కో ఏడాదికి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా..? అని ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోడీ. వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్ఎస్ కూడా మోసం చేసిందన్నారు. దళిత బంధుతో బీఆర్ఎస్ ఎస్సీలను చాలా మోసం చేసిందన్నారు.
దేశంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత దళితుడు అయినటువంటి రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా, 2019లో ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్మును కూడా రాష్ట్రపతిగా చేసిన ఘనత ఎన్డీఏకు దక్కుతుందన్నారు. ముఖ్యంగా చర్మం రంగు ఆధారంగా మన దేశంలో యోగ్యత నిర్ణయిస్తారా..? అని ప్రశ్నించారు. అహ్మదాబాద్ నా కర్మభూమి.. ఆ నగర దేవత కూడా భద్రకాళి.. అలాగే వరంగల్ లో కూడా భద్రకాళి దేవత ఉండటం విశేషం. వరంగల్ ను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి. వరంగల్ నుంచి ఆరూరి రమేష్.. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ.