తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఇవాళ మద్యం షాపులను క్లోజ్ చేయనుంది సర్కార్. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు అంటే 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం ప్రకారం… హైదరాబాద్ మహానగరం లోని కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్, సౌత్ వేస్ట్, మల్కాజ్గిరి మరియు మహేశ్వరం జోన్లలో ఒకరోజు పాటు వైన్ షాపులను బంద్ చేయనున్నారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ మరియు ఎల్బీనగర్ డివిజన్ లలో.. ఇవాల్టి నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు అంటే రెండు రోజులపాటు మద్యం దుకాణాలను మూసివేస్తారు. ఈ విషయం తెలియడంతోనే నిన్న అర్ధరాత్రి వరకు మద్యం కొనుగోలు జరిగాయి.