కొత్త సచివాలయం నిర్మాణం..పైన పటారం లోన లొటారం – వైఎస్ షర్మిల

-

కొత్త సచివాలయం నిర్మాణం..పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉన్నాయని తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల చురకలు అంటించారు. రూ. 11 వందలు కోట్లు పెట్టి కట్టిన సచివాలయంలో సరైన భద్రత ప్రమాణాలు లేవని బయటపడిందని ఆగ్రహించారు. అంతేలే దొర గారు ఏది కట్టినా.. పైన పటారం లోన లొటారం అంటూ చురకలు అంటించారు. ఇప్పటికైనా ప్రమాదం ఎందుకు జరిగింది అని అన్వేషించాల్సింది పోయి.. మాక్ డ్రిల్ చేశాం అంటూ పచ్చి అబద్ధాలు చెప్తే నమ్మే వారు ఎవరు లేరన్నారు.

- Advertisement -

ప్రారంభానికి సిద్ధం అవుతున్న సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం పై దర్యాప్తు చేయించాలి.అఖిలపక్షం నేతల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని కోరారు. మహానేత వైయస్ఆర్ ప్రజా దర్బార్ పెట్టి, నేరుగా జనం సమస్యలు తెలుసుకున్నారు. కేసీఆర్ పాలనలో మాత్రం సామాన్యుడు కాదు కదా ఉద్యమకారులకు కూడా అనుమతి లేదని విమర్శలు చేశారు తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. కేసీఆర్ గారికి ప్రజల ముందుకొచ్చే దమ్ము ధైర్యం ఉంటే మేం పంపిస్తున్న బూట్లు వేసుకొని మాతో పాటు పాదయాత్ర చేయాలని సవాల్ చేస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...