TJS కార్యాలయంలో కోదండరాం తో వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన కొట్లాడటమే T – SAVE లక్ష్యం అని.. అన్ని పార్టీలు ఏకం అవ్వాలని కోరారు. అన్ని పార్టీలు ఓకే వేదిక మీదకు వస్తె నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.. T – SAVE ఫోరం అధ్యక్షుడుగా ఉండాలని కోదండరాంను కోరామని చెప్పారు.
కోదండరాం సానుకూలంగా స్పందించారు.. కలిసి కొట్లాడక పోతే నిరుద్యోగులకు న్యాయం జరగదని వెల్లడించారు. ఎవరికి వారు పోరాటం చేసినా కేసీఅర్ అణచి వేస్తున్నాడని.. అందరం ఒక వేదిక మీదకు వస్తె వెంటనే న్యాయం జరుగుతుందని తెలిపారు. TJS అద్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ..
T- SAVE లో భాగస్వామ్యం కావాలని షర్మిల అడిగారు..నిరుద్యోగుల పక్షాన కొట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. షర్మిల ప్రతిపాదనల పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.