వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ పాదయాత్రలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. వేములవాడ రాజన్న ఆలయానికి కనీసం 200 కోట్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. సీఎం కేసీఆర్ కి యాదాద్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కాబట్టే అక్కడ అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇక్కడి ఎమ్మెల్యే ఆయన చెన్నమనేని రమేష్ కాదు.. జర్మనీ రమేష్ అని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆయనకు జర్మనీలో ఏం పని? అని ప్రశ్నించారు.