వరద ప్రభావ ప్రాంతాల్లో నిన్నటి వైఎస్ షర్మిల పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంచిర్యాలలో పర్యటించిన షర్మిల… కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వస్తాయని తెలిసినా, ముంపు ప్రాంతాలపై ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించింది. KCR చెప్పిన రూ.10వేలు వస్తాయో లేదో తెలియదు.YSR తెలంగాణ పార్టీ తరుఫున మంచిర్యాల పట్టణంలోని NTR నగర్ లో వరదలకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తామని ప్రకటన చేశారు.
వైఎస్సార్ బ్రతికి ఉంటే తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేదా ? అని నిలదీశారు వైఎస్ షర్మిల. 2002 నుంచి ఈ పోడు భూములను సాగు చేసుకుంటున్నారని… ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పోవడం దారుణమని ఆగ్రహించారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని… వైఎస్సార్ మీ పట్టాలను మీ చేతుల్లో పెట్టే వారన్నారు. ఈ భూములు మావి అని 52 కుటుంబాలు ప్రతి ఏడాది పోరాటం చేస్తున్నారు… ప్రతి ఏడాది హింసిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ ఇచ్చిన ఇల్లులను వదిలి పేట్టి ఇక్కడే గుడిసెలు వేసుకున్నారని… పోడు పట్టాలు అడిగితే గొడ్డలి తో నరికేస్తరా..? అని ఆగ్రహించారు.