తెలుగు పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది – బాలకృష్ణ

-

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్ లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు చలపతిరావు. 1944 మే 8న కృష్ణాజిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దాదాపు 1200 కు పైగా సినిమాలలో నటించారు చలపతిరావు.

1966 లో గూడచారి 116 చిత్రంతో సినీ రంగంలో అడుగు పెట్టారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. చలపతిరావు హఠాన్మరణం తనని తీవ్రంగా కలచివేసిందన్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది అన్నారు. మా కుటుంబంతో చలపతిరావుకు అవినాభావ సంబంధం ఉందని.. నాన్న గారితో కలిసి చలపతిరావు అనేక చిత్రాలలో నటించారని గుర్తుచేసుకున్నారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news