హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట

-

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రెండవ రోజు రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.రాహుల్ గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులోని ఈడీ ఆఫీస్ ఎదుట నిరాహార దీక్షకు దిగింది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అగ్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, సిడబ్ల్యూసి మెంబర్లు మద్దతు తెలుపుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి యత్నించారు. జగ్గారెడ్డి ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ బాటిళ్లతో వచ్చి నిరసన తెలియజేశారు.మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.కొద్దిసేపు ఉద్రిక్తత తరువాత ఈడి ఆఫీస్ నుంచి గాంధీభవన్ చేరుకున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news