దేశ వ్యాప్తంగా కార్మికులు, రైతులు ఇచ్చిన సమ్మె కొనసాగతుంది..పలు రాష్ట్రాల్లో శాంతి యుతంగా జరుగుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో హింసాత్మకంగా మారుతుంది..ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది..కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గత నెల రోజుల నుంచి పంజాబ్ రైతులు నిరసన కార్యాక్రమాలు చేస్తున్నారు..దాదాపు 15 రోజులు రైల్ రోకో నిర్వహించారు..ఇవాళ జాతీయ కార్మిక సంఘల సమ్మె పిలుపుకు పంజాబ్ రైతులు సంపూర్ణ మద్దతూ తెలిపారు..సమ్మెలో భాగంగా చలో పార్లమెంట్ పిలునిచ్చారు.పంజాబ్ రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పంజాబ్- హర్యానా బార్డర్‌లో రైతులను అడ్డుకున్నారు పోలీసులు..ఉదయం నుంచే భద్రత కట్టు దిట్టం చేసిన పోలీసులు..వాహనాలను తనిఖీలు చేయడం మొదలు పెట్టారు..రైతులు ముందుకు వెళ్లకుండా బార్డర్‌ను సీజ్ చేశారు. అక్కడి నుంచి వారిని వెనక్కి వెళ్లాలని కోరారు. రైతులు ఎంతకీ ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ క్యాన్స్ ఉపయోగించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా అన్నదాతలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో ఆగ్రహించిన రైతులు.. బారికేడ్లను తీసి పక్కకు నెట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెను దాటుకుని ముందుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల చర్యలతో పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి.