కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలే కాదు.. తినేందుకు మనకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సీజనల్‌గా లభిస్తుంటాయి. కొన్ని ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే పండ్లను తినడం వరకు బాగానే ఉంటుంది, కానీ వాటిని ఏ సమయంలో తినాలి ? ఎప్పుడు తింటే వాటి వల్ల మనకు లాభాలు కలుగుతాయి ? అనే విషయం చాలా మందికి తెలియదు. మరి ఇందుకు వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!
* ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కొంచెం తగ్గించి అందుకు బదులుగా పండ్లను తినవచ్చు. దీంతో రోజంగా యాక్టివ్‌గా ఉంటారు. మన శరీరానికి కావల్సిన పోషకాల్లో చాలా వరకు ఉదయాన్నే లభిస్తాయి. దీంతో శరీరం ఉత్తేజంగా ఉంటుంది. అలసట తగ్గుతుంది. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. దీని వల్ల ఉదయం ఉండే బద్దకం కూడా పోతుంది.
* బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు మధ్య కూడా పండ్లను తినవచ్చు. ఆ సమయంలో సిట్రస్ పండ్లను తింటే మంచిది. అంటే నారింజ, బత్తాయి, కివీ, పైనాపిల్ వంటి పండ్లను తీసుకోవాలి.
* మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత మామిడి పండ్లు, పుచ్చకాయలు, పైనాపిల్ వంటి పండ్లను తినవచ్చు.
* సాయంత్రం సమయంలో కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్స్‌ను తినేకంటే పండ్లను స్నాక్స్ రూపంలో తీసుకుంటే మంచిది. దీంతో సాయంత్రం పూట కూడా యాక్టివ్‌గా ఉండవచ్చు.
ఇక రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ పండ్లను తినరాదు. వాటి వల్ల శరీరానికి శక్తి బాగా లభిస్తుంది కనుక రాత్రి మనకు నిద్ర ఉండదు. నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి రాత్రి పూట తప్ప పైన తెలిపిన ఏ సమయంలో అయినా పండ్లనుత తీసుకోవచ్చు. కాకపోతే.. ఒకే రకమైన పండ్లు కాకుండా భిన్న రకాల పండ్లను రోజు మొత్తం కవర్ చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.