నివర్ తుఫాన్ నుంచి ఏపీ ప్రజలు కాస్త ఊరిపి పీల్చుకున్నారు..ఇటీవలే కురిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు మళ్ళీ నివర్ తుఫాన్ ఎలాంటి కన్నీటిని మిగుల్చుతుందోన్న భయంలో ఏపీ రైతులు రెండు రోజుల పాటు ఆందోళన చెందారు..అర్థరాత్రి తీరం దాటాక నివర్ తుఫాన్ కాస్త బలహీనపడింది.దీంలో ప్రజల్లో కొత్త ఆశలు వచ్చాయి..ఎక్కువ పంటనష్టం జరగకపోవడంతో ఊరిపి పీల్చుకున్నారు..తీరం దాటిన నివర్ అతి తీవ్ర తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్‌గా మారింది..దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలో నివర్ తన ప్రతాపాన్ని చూసిస్తుంది.. బంగాళాఖాతం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారింది..తమిళనాడులోని అరియాలూర్, కడలూరు, కంచిపురంలో భారీ వర్షం కురుస్తోంది.. విల్లుపురం, నాగపట్నం, పుదుచ్చేరిలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు తమిళనాడులోనే లక్షా 45 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు చెన్నై నగరాన్ని వర్షం ముంచెత్తింది. మెరీనా బీచ్‌లో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాన్ ధాటికి సముద్రం ముందుకొచ్చింది. నివర్ ఎఫెక్ట్‌తో చెన్నైలో బస్సులు, మెట్రో రైళ్లు రద్దు ఇప్పటికే రద్దు చేశారు అధికారులు. విమానాలు కూడా రద్దు చేసనిట్లు ప్రకటించారు. చెన్నై వరద సహాయ కార్యక్రమాల్లో 1,200 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గంటున్నారు.
పుదుచ్చేరిలో నివర్ కల్లోలం సృష్టిస్తోంది. తుఫాన్ ధాటికి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లక్షమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వరద సహాయ కార్యక్రమాల కోసం 10 హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. అటు ప్రజలు బయటకు రాకుండా 144సెక్షన్ విధించింది పుదుచ్చేరి ప్రభుత్వం. పుదుచ్చేరిలో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం నారాయణ స్వామి స్వయంగా రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు.