ఇస్రోలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇస్రోకు చెందిన Liquid Propulsion Systems Centre (LPSC)లో ఈ నియామకాలు చేపట్టారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 6 ఆఖరి తేదీ.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. హెవీ వెహికిల్ డ్రైవర్ 2, లైట్ వెహికిల్ డ్రైవర్ 2, కుక్ 1, ఫైర్ మాన్ 2, క్యాటరింగ్ అటెండెంట్- 1. విద్యార్హతల వివరాలు చూస్తే… టెన్త్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ ద్వారా వచ్చే అప్లికేషన్లను మాత్రమే స్వీకరిస్తామని నోటిఫికేషన్లో తెలిపారు.

ఆఫ్ లైన్ ద్వారా పంపించే అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. ఇక శాలరీ వివరాలని చూస్తే.. పోస్టు ఆధారంగా రూ. 18 వేల నుంచి రూ. 63 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇది ఇలా ఉంటే పోస్టుల వారీగా కావాల్సిన అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ.150. పూర్తి వివరాలని ఇక్కడ చూడచ్చు. https://www.lpsc.gov.in/docs/Advt%20LPSC-02-2021.PDF

Read more RELATED
Recommended to you

Latest news