Varisu : విజయ్‌ ‘వారసుడు’ ఫస్ట్‌ సింగిల్‌ ప్రొమో

-

తలపతి విజయ్ హీరోగా తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్న మొదటి మూవీ వారసుడు. ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా తమిళంలో ‘వరిసు’ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం తుది దశ షూటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమాపై క్రేజీగా అప్డేట్స్ ను అందిస్తున్నారు. తాజాగా ‘వారసుడు’ నుంచి మొదటి సాంగ్ ప్రొమోను మాత్రమే విడుదల చేశారు మేకర్స్‌. ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రోమో రానుందని ముందుగానే ప్రకటించారు. చెప్పినట్టుగానే సాయంత్రం 6.30 గంటలకు ప్రొమో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

 

చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్న థమన్ విజయ్ కోసం ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేశాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వంశీ పైడిపల్లి తొలిసారి దర్శకత్వం హిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://twitter.com/SVC_official/status/1588154071533305858?t=Uv_6-G3fSqfUZ1L540L92Q&s=08

Read more RELATED
Recommended to you

Latest news