పవన్‌.. కేంద్ర నిఘా సమాచారం ఉంటే బహిర్గతం చేయాలి : తానేటి వనిత

-

ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల పై చేసిన ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. జనసేనాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వుమెన్ ట్రాఫికింగ్‌పై పవన్ వద్ద ఆధారాలు ఉంటే… కేంద్ర నిఘా సమాచారం ఉంటే బహిర్గతం చేయాలని ఆమె కోరారు. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు ఎనలేని సేవలు అందించారని ఆమె తెలిపారు. వారు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేశారని అన్నారు వనిత.

Govt committed to empowerment of women: Taneti Vanitha

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు జిల్లాలకే పరిమితం చేశారని మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై పవన్ నీచ ఆరోపణలు చేశారని తీవ్ర్ స్థాయిలో మండిపడ్డారు. పవన్ ను ట్రాప్ చేసి చంద్రబాబు వాలంటీర్లపై అలా మాట్లాడించారన్నారు. గత ఎన్నికల్లో జనసేన ఒక్క సీటూ గెలవలేదని, రాపాక వరప్రసాద్ కు మంచి పేరు ఉండటం వల్లే గెలిచాడన్నారు వనిత.

Read more RELATED
Recommended to you

Latest news