జీతం తీసుకునే వాళ్ళు వాలంటీర్లు కాదు: పవన్ కళ్యాణ్

-

గత అయిదు రోజుల నుండి పవన్ కు మరియు వాలంటీర్లకు మధ్యన వివాదం మెల్ల మెల్లగా రాజుకుంటోంది. వాలంటీర్ల ద్వారా సమాచారం అక్రమ మార్గాలకు దారి తీస్తోంది అని పవన్ ఒక సభలో పేర్కొనడం తీవ్ర దురామారాన్ని రేపుతోంది. రెండున్న లక్షల వాలంటీర్లు ఇప్పుడు పవన్ కు వ్యతిరేకంగా మారిపోయారు. తాజాగా పవన్ కళ్యాణ్ వారు రెస్పాండ్ అవుతున్న తీరు పట్ల స్పందించాడు.. ఈయన మాట్లాడుతూ వాలంటీర్లు తనకు సోదర సమానులని.. వాళ్ళను ఇబ్బంది పెట్టడం లేదా పొట్ట కొట్టడం నా ఉద్దేశ్యం కాదన్నారు. నేను అందరి గురించి చెడ్డగా చెప్పడం లేదు. కొందరు మాత్రమే ఇటువంటి దారుణాలు జరగడానికి కారణం అవుతున్నారు అని చెబుతున్నానని క్లారిటీ ఇచ్చారు. మాములుగా వాలంటీర్లు అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేయాలి. కానీ మీకు నెలకు 5 వేలు చొప్పున జీతంగా చెల్లిస్తున్నారు.

pawan kalyanఅలాంటప్పుడు మీరు వాలంటీర్లు ఎలా వాడుతారు అంటూ పవన్ వారిని ప్రశ్నించడం కొసమెరుపు. ఇప్పుడు మీ పరిస్థితి బూమ్ బూమ్ కి తక్కువ ఆంధ్ర గోల్డ్ కి ఎక్కువ అంటూ ఆఖర్లో సెటైర్ వేశారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news