అంద‌రిలా కాకుండా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా చేయాల‌నుకున్నా : హిమాన్షు

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంలో ప్రతిఒక్కరూ అనర్గళంగా మాట్లాడగలరు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ ఇలా ఎవరైనా సరే మైక్ అందుకున్నారంటే పలు భాషాల్లో తమ స్పీచ్‌లతో అక్కడున్న వారిని అటెన్షన్ ఈజీగా తమవైపు తిప్పుకుంటారు.. తాజాగా.. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకన్నాడు. తన ఫస్ట్ పబ్లిక్ స్పీచ్‌లోనే అదరగొట్టారు. హైదరాబాద్ శివారులోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న హిమాన్షు.. దాన్ని కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా తీర్చిదిద్దారు. దాదాపు రూ. కోటి వెచ్చించి స్కూల్‌ను పునర్నిర్మించారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హిమాన్షురావు ఫస్ట్ స్పీచ్‌తోనే అదరగొట్టారు.

గౌలిదొడ్డిలోని కేశవనగర్‌ ప్రభుత్వ పాఠశాలను తొలిసారి సంద‌ర్శించిన‌ప్పుడు క‌ళ్ల‌ళ్లో నీళ్లు వ‌చ్చాయ‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు పేర్కొన్నారు. అప్పుడే అంద‌రిలా కాకుండా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా చేయాల‌నుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మ‌నువ‌డ్ని క‌దా.. ఏదైనా నార్మ‌ల్‌గా చేసే అల‌వాటు లేదని హిమాన్షు పేర్కొన్నారు. క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షు దాదాపు కోటి రూపాయల నిధులు సేకరించి సర్కారు బడికి జీవం పోశారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దిన ఈ బడిని హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news