Naga chaitanya : ‘థ్యాంక్యూ’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు!

-

టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం.. బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో పల్లెటూరి బుల్లోడిగా ఆయన కనిపించి… మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి థ్యాంక్యూ రానుంది. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పార్ట్‌ ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల డేట్‌ ను కూడా ప్రకటించేసింది చిత్ర బృందం. జూలై 8 వ తేదీన థ్యాంక్యూ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

ఈ మేరకు అధికారిక పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా.. ఈ సినిమా లో చైతూ సరసన రాశి ఖన్నా.. మాళవిక నాయర్‌, అవికా గోర్‌ నటించారు. ఈ సినిమా తమన్‌ సంగీత స్వరాలు అందించారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ విడుదల కానున్నాయి. కాగా.. ఆరు నెలల కిందట సమంతకు చైతూ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news