అదిరే స్కీమ్.. భార్యాభర్తలకు ఏడాదికి రూ.1,11,000…!

-

ఎన్నో రకాల స్కీమ్స్ మనకి అందుబాటులో వున్నాయి. ఈ స్కీమ్స్ వలన చాలామందికి ఎంతో ప్రయోజనం ఉంటోంది. పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ పోస్టాఫీస్‌ స్కీమ్ వలన ఎంతో లాభం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేరవచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ లో రూ. 9 లక్షల వరకు డబ్బులు పెట్టవచ్చు. దీనిలో చేరితే రూ. 15 లక్షల వరకు డబ్బులును ఇన్వెస్ట్ చేయొచ్చు.

ప్రతీ నెలా కూడా రాబడి వస్తుంది. ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ రేటు వస్తుంది. వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారవచ్చు. త్రైమాసికం చొప్పున సమీక్షిస్తూ వుంటారు. కేవలం రూ. 1000 మొత్తంతో పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరవచ్చు. డబ్బులు ఇన్వెస్ట్ చేసాక ఏడాది వరకు విత్‌డ్రా ఆప్షన్ ఉండదు. మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే 2 శాతం దాకా పెనాల్టీ పడుతుంది.

మెచ్యూరిటీ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ఇచ్చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన వారు మెచ్యూరిటీ కన్నా ముందే చనిపోతే డబ్బులు ఇచ్చేస్తారు. ఈ స్కీములో జాయింట్ అకౌంట్ కింద రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏటా రూ.1,11,000 మీకు వస్తాయి. అంటే నెలకు రూ. 9 వేలుకి పైనే.

 

Read more RELATED
Recommended to you

Latest news