వాళ్ళను చూశాక‌.. జబర్దస్త్ వీడాలంటే భయం.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాకెట్ రాఘవ..!!

-

జ‌బ‌ర్ద‌స్త్ షో గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాలుటా నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఎంద‌రో వ‌చ్చి పోతున్నా ఈ షో స్టార్ట్ అయిన‌ప్ప‌టినుండి ఇప్ప‌టి వ‌ర‌కు రాకెట్ రాఘ‌వ కొన‌సాగుతున్నాడు. సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఈ షో ఎంతో మంది సెలబ్రిటీలకు కూడా దారి చూపించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు ఇంత స్టేజ్లో మంచి పేరు సంపాదించుకున్నారు అంటే అందుకు కారణం జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్, రష్మీ , గెటప్ శ్రీను, రాంప్రసాద్, ఆది , అభి , చమ్మక్ చంద్ర లాంటి వారందరూ అవకాశాలు లేక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమయంలో మల్లెమాలవారు పిలిచి మరి వీరికి అవకాశాలు ఇచ్చి ఈరోజు వారిని స్టార్స్ గా తీర్చిదిద్దారు. అయితే వీరంతా కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ ను వీడి వెళ్లిపోవడం జరిగింది.

మొదటగా మల్లెమాల యూనిట్ తో చిన్న గొడవల వల్ల నాగబాబు షో నుంచి వెళ్లిపోగా ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడం జరిగింది. ఇకపోతే జబర్దస్త్ ను వదిలి బయట వాళ్లు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి షోలో పనిచేస్తున్న వాళ్లకి బాగా భయం పుడుతున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై స్పందించిన రాకెట్ రాఘవ అందుకే జబర్దస్త్ ను వీడి వెళ్లడం అంటే చాలా భయంగా ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2001లో సినిమాలలో చిన్న చిన్న కామెడీ పాత్రల ద్వారా బుల్లితెరకు పరిచయమైన రాకెట్ రాఘవ సీరియల్స్ , టీవీ షోలో చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక 2013లో ఈటీవీలో ప్రారంభమైన జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా తన టీం తో కలసి కొన్ని వందల స్కిట్లు చేసి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇప్పటివరకు జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంతోమంది కమెడియన్లు వస్తున్నా.. పోతున్నా ఆయన మాత్రం పదిలంగా ఇప్పటికే కొనసాగుతూనే ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోని పలు ఆసక్తికరమైన విషయాలను కూడా ఆయన వెల్లడించారు. రాకెట్ రాఘవ మాట్లాడుతూ జబర్దస్త్ షో ద్వారా సీనియర్ యాక్టర్ ల ద్వారా అలాగే కొత్తగా వచ్చే కమెడియన్ల ద్వారా చాలా నేర్చుకొని నన్ను నేను అప్డేట్ చేసుకున్నాను. జబర్దస్త్ షో మొదట్లో కన్నా ఇప్పుడే బాగుంది.. తక్కువ టైంలోనే ఎక్కువ కామెడీ అందించగలుగుతున్నాము అంటూ చెప్పుకొచ్చారు. జబర్దస్త్ ను వీడి వెళ్లడం గురించి చెప్పిన ఆయన.. చేసే పనిలో సంతృప్తి అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇక రెండవది జబర్దస్త్ వీడి వెళ్లిన వాళ్ల పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అందుకే ఇలాంటి ప్లేస్ మళ్లీ దొరకదు కాబట్టి నాకు ఈ షో నుంచి వెళ్లడం భయం అంటూ ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version