దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ నేవీ భాగస్వామ్యంతో సరికొత్త ఎన్ఏవీ–ఈ క్యాష్ కార్డును లాంచ్ చేసింది. ఈ NAV-eCash కార్డును భారతదేశంలోని అతిపెద్ద నావల్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పేరొందిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ఆవిష్కరించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ NAV-eCash కార్డ్ డిజిటల్ చెల్లింపుల విభాగంలో మైలురాయి నిలుస్తుందని అన్నారు.
అయితే సముద్రంలో నౌకను మోహరించే సమయంలో భౌతిక నగదు నిర్వహణలో తలెత్తే సమస్యలకు ఈ కార్డు చెక్ పెడుతుందని చెప్పడం జరిగింది. అయితే మాములుగా నౌకాశ్రయాల్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు కనుక డబ్బులని విత్ డ్రా చేసుకోవాలి అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్యూయల్-చిప్ టెక్నాలజీ సహాయంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలను నిర్వహించే విధంగా ఈ సరికొత్త కార్డుని రూపొందించడం జరిగింది.
దీని గురించి నేవి అధికారులు మాట్లాడుతూ.. ఎస్బీఐ. ఈ కొత్త NAV-eCash కార్డు డిజిటల్ చెల్లింపుల పరిష్కారం చూపిస్తుందని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్‌కు ఇది నిదర్శనమని అన్నారు. ఎస్బీఐ, నేవీ అధికారులు సంయుక్తంగా దీనిని రూపొందించడం జరిగింది.
రక్షణ దళాల పట్ల బ్యాంకు నిబద్ధత, భారత సాయుధ దళాలతో తమ సుదీర్ఘ బంధాన్ని ఎస్బీఐ వివరించింది. కాగా, ఎస్బీఐ ఇప్పటివరకు 30 లక్షల భారతీయ కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చంది. ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతి పెద్ద వాణిజ్య బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాణిస్తోంది.