రాజధానిపై చేసిన ఖర్చులకు సంబంధించి ఏపీ హైకోర్ట్ కి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మీకు ఖర్చుల వివరాలను మేము చెప్పలేమని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. హై కోర్టులో డిఫ్యూటీ అకౌంటెంట్ జనరల్ పిటీషన్ దాఖలు చేసారు. రాజధానిలో నేటివరకు నిర్మాణాలకు వెచ్చించిన నిధులు, పిలిచిన టెండర్లు, నిర్మాణ సంస్థల క్లెయిమ్ లు వివరాలని అకౌంటెంట్ జనరల్ ను హైకోర్ట్ ఆదేశించింది.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజ్యాంగబద్ద సంస్థ అని, కేంద్రం వెచ్చించిన నిధులకు పార్లమెంట్ కి సమాధానం పంపుతాం అని పేర్కొంది. రాష్ట్రం మంజూరు చేసే నిధులకు శాసనసభ అడిగితే సమాచారం ఇస్తాం అని స్పష్టం చేసింది. అలా కాకుండా వ్యయం చేసే నిధులకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి అనుమతి లేదని పిటీషన్ వేసారు. హై కోర్టు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ కు కౌంటర్ అఫడవిట్ ను డిఫ్యూటీ అకౌంటెంట్ జనరల్ పంపించారు.