వృద్దురాలు లైంగిక కోరికలు తీర్చలేదని, కాళ్ళు చేతులు నరికీ…!

ఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణం జరిగింది. లైంగిక కోరికలకు ఒప్పుకోకపోవడంతో దారుణ హత్యకు గురైంది ఓ వృద్దురాలు. 15 రొజుల క్రితం జరిగిన హత్య ను పోలీసులు ఇప్పుడు చేధించారు. భజ్యా తండా కు చెందిన ఆజ్మీరా నాజీగా వృద్దురాలుని పోలీసులు గుర్తించారు. నాజీ యాచకురాలిగా జీవనం సాగిస్తుందని పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన తరవాత కాళ్లు చేతులు నరికి వాటిని కాల్చేసాడు.

ఆ తర్వాత తల నరికి ఖమ్మం ఎన్ ఎస్పీ కాలవలో దుండగుడు పడేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య వివరాలను సి ఐ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. హత్య చేసిన ఉపేందర్ కు భార్య అనసూయ, కొడుకు కేశవరావు సహకరించారని పోలీసులు గుర్తించడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.