ఎడమచేతి వాటం కలవారికి తెలివి ఎక్కువగా ఉంటుందట..ఎడమ చేత్తే రాయటం, ఏ పనిని అయినా..ఎడమ చేత్తోనే చేయటం ఇలాంటి వారికి మెంటల్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటందని ఒక పరిశోధనలో తేలింది. ఇలా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం.
నవ్వించే వారిని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. అయితే 1977 లో చేసిన ఒక పరిశోధన ప్రకారం కమెడియన్స్‌కి ఎక్కువ ఐక్యూ ఉంటుందని తేలింది. ఫ్రాన్స్ కు సంబంధించిన నిపుణులు ఒక పరిశోధన చేయగా బక్కగా ఉన్న వారికి చాలా ఐక్యూ ఉంటుంది ఆని చెప్పారు. ఎవరి బాడీ మాస్ ఇండెక్స్ అయితే 20 లేదా అంతకంటే తక్కువ ఉన్న వారిలో చాలా జ్ఞాపక శక్తి ఉంటుందని కనుగొన్నారు.
మరి కొంత మంది నిపుణులు అయితే ఎవరైతే కుటుంబంలో మొదటి పుడతారో వాళ్ళకి 18, 19 ఏళ్ళు ఉన్నప్పుడు వారి ఐక్యూ 2.3 పాయింట్లు కంటే ఎక్కువగా ఉందని తేల్చారు. అంటే ఇంట్లో ఉండే పిల్లలలో మొదటి వారికి ఎక్కువ ఐక్యూ ఉంటుందట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరైతే రాత్రి పూట ఎక్కువగా పని చేస్తారో వాళ్లకి ఐక్యూ చాలా ఉంటుంది అని ఒక యూనివర్సిటీకి సంబంధించిన నిపుణులు తేల్చారు.
బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన పిల్లలకు కూడా ఐక్యూ ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు ఒక పరిశోధనలో తెలిపారు. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని గమనించాలి. ఈరోజుల్లో డబ్బాపాలకు పిల్లలను అలవాటు చేస్తారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
సిగ్గు పడుతూ, మోహమాటపడుతూ… నెమ్మదస్తులుగా ఉంటారు కొందరు..వీళ్లను అస్సలు తక్కువ అంచనా వేయకండి.. తెలివైన వారిలో 60 శాతం మంది ఈ కేటగిరీ కు చెందిన వారే అని గిఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ వారు నిరూపించారు. మనలో కొంత మంది దేవుడిని నమ్ముతారు..మరికొందరు దేవుడే లేడు అని నమ్ముతారు.
అయితే అటువంటి వారికి తెలివి ఎక్కువగా ఉంటుందని ఓ సైకాలజిస్ట్ చెబుతున్నారు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారికి బుర్రలేదని కాదు.. దేవుడిని నమ్మడం లేదు అంటే..వాళ్లు ఏ కష్టం వచ్చినా ఒకరిపై భారం వేయకుండా సొంతగా సాల్వ్ చేసుకుందాం అనే మెంటాలిటీ వాళ్లు..స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ దేవుడిని నమ్మే మనం..కష్టమైన, బాధైనా, సుఖమైనా అన్నీ ఆ దేవుడుకి చెప్తాం..తీర్చమంటాం..మన ప్రయత్నం మనం చేస్తాం..
-Triveni Buskarowthu