హలో నేచర్ లవర్స్.. రాజస్థాన్​లో ఈ అందమైన ప్రదేశాలను చుట్టొచ్చారా..??

-

రాజస్థాన్.. ద ల్యాండ్ ఆఫ్ కింగ్స్ లేదా ద ల్యాండ్ ఆఫ్ కింగ్​డమ్స్ అని పిలుస్తాం. చారిత్రక కోటలు, రాజభవనాలకు రాజస్థాన్ పెట్టింది పేరు. చరిత్రపై ఆసక్తి ఉన్న వాళ్లు మొదటగా చూడాల్సిన ప్రదేశం రాజస్థాన్. కేవలం చారిత్రక కట్టడాలే కాదు.. ఇక్కడ ప్రకృతి రమణీయతతో అలరారే ఎన్నో టూరిస్ట్ ప్రాంతాలున్నాయి. ప్రకృతి ప్రేమికులు ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. నేచర్ లవర్స్.. లెట్స్ గో టూ రాజస్థాన్..

రాజస్థాన్​కు వెళ్లిన వాళ్లు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం మౌంట్ అబూ. దీన్ని రాజస్థాన్ హిల్ స్టేషన్ అని పిలుస్తారు.. ఇది హనీమూన్ స్పాట్‌గా పేర్కొంటారు. వర్షాకాలంలో రాజస్థాన్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే మౌంట్ అబూకు తప్పకుండా వెళ్లాలి. ఎందుకంటే ఈ పర్యాటక ప్రదేశం వర్షంలో మరింత అందంగా కనిపిస్తుంది.

సరస్సులంటే ఇష్టపడే వాళ్లు వెళ్లాల్సిన ప్రదేశం సజ్జన్‌గఢ్ ప్యాలెస్. ఎందుకంటే ఈ ప్యాలెస్​లో ఎన్నో సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సుల్లో బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తిలకిస్తూ.. పక్షుల కిలకిలరావాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటే స్వర్గంలో విహరిస్తున్నట్లే ఉంటుంది. సజ్జన్‌గఢ్ ప్యాలెస్ నుంచి సూర్యాస్తమయం దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది.

రాజస్థాన్​లో ఉన్న మహో హిల్ స్టేషన్ అచల్‌ఘర్ హిల్. ఈ పర్వతం మౌంట్ అబూ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని చుట్టూ ఉన్న పచ్చదనం ప్రకృతి ప్రేమికుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబ సమేతంగా వెళ్తే భలే ఎంజాయ్ చేయవచ్చు.

ప్రశాంతంగా కాసేపు గడపాలనుకుంటే మీరు వెళ్లాల్సిన ప్రదేశం గురు శిఖర్. పచ్చదనంతో పరుచుకున్న ఈ శిఖరంపై ట్రెక్కింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న దత్తాత్రేయ ఆలయం చాలా ఫేమస్. మరెందుకు ఆలస్యం మీ కాలేజ్ గ్యాంగ్​తోనో, ఆఫీస్ గ్యాంగ్​తోనో గురుశిఖరాన్ని చుట్టేయండి.

ఇవే కాక రాజస్థాన్​లో ఇంకా చాలా టూరిస్ట్ ప్రాంతాలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రదేశాలు చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడి ప్యాలెస్​లో అడుగుపెడితే నిజంగా రాజభవనంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కసారి లోపలికి వెళ్లామంటే ఇక బయటకు రావాలని అస్సలు అనిపించదు.

Read more RELATED
Recommended to you

Latest news