ఒకప్పుడు పెళ్లి అంటే చాలు.. వధువులు ఎంతో సిగ్గుపడేవారు. తల దించుకుని పెళ్లి పీటలపై కూర్చొని.. పెళ్లి తతంగం పూర్తయ్యే వరకు తల ఎత్తేవారు కాదు. ఒక్కప్పుడు పెళ్లిళ్లు, బరాత్‌లలో డ్యాన్సులు చేయడానికి వధువులను అతి కష్టంగా లాక్కేళ్లి డ్యాన్స్ చేయించేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడు డ్యాన్సులు చేసుకుంటూనే పెళ్లి మండపానికి వధువులు ఎంట్రీ ఇస్తున్నారు. ఓ రేంజ్లో మాస్ స్టెప్పులు వేస్తూ.. అందరినీ ఉర్రూతలూగిస్తున్నారు. ఆ డ్యాన్సులు చూసిన గెస్ట్ ల మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.
అప్పట్లో పెళ్లిళ్లల్లో ‘బుల్లెట్ బండి’ సాంగ్ ఎంతో ఫేమస్. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఈ సాంగ్‌పై కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా ఒక పెళ్లి కూతురు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సాంగ్‌కు పెళ్లి కూతురు ఊర మాస్ స్టెప్పులు వేసి.. అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ‘అనూప్ మను సినిమాటోగ్రఫి’ అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పెళ్లి కూతురు డ్యాన్స్ అదరగొడుతోందని కామెంట్స్ పెడుతున్నారు.