పార్వతీపురం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులకు,జిల్లా మంత్రులకు ఉంది అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో రాజకీయం అవసరమని అన్నారు. గత ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యకలాపాలు జరగబట్టే మనం అధికారంలోకి వచ్చామన్నారు.
ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అధికారులు నిర్వహించాలని కోరారు. రెండోసారి అధికారంలోకి రావడం కోసం మొదటి సారి ఎన్నికైన ప్రతినాయకుడు కష్టపడాలి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోచుకోవడం- దాచుకోవడం తప్ప చెప్పుకోదగ్గ సంక్షేమ పథకాలు లేవన్నారు బొత్స. పార్టీ కోసం కష్ట పడిన వారికి అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది.. వారికే పార్టీ పదవులు అన్నారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చాలా అవసరమని అన్నారు. వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు.