ఐపీఎల్ మ్యాచ్ తర్వాత భారత్-దక్షిణాఫ్రికా టీమ్‌ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఐదు మ్యాచ్‌లు టీ20 సిరీస్‌లో చాలా మంది యువ ఆటగాళ్లకు ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు టీమిండియా తరఫున ఆరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీ20లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ మ్యాచ్‌లో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ఇండియన్ కోచ్‌గా ఉండనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీకి అధినేతగా కొనసాగుతున్నారు. కాగా, టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటను కూడా వెళ్లాల్సి ఉంది. ఈ జట్టుతో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా వెళ్లనున్నారు. ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం.. దక్షిణాఫిక్రా సిరీస్‌లో ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ కనిపించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం టీమిండియా రీసెస్టర్ షైర్‌లో వార్మప్ మ్యాచ్ ఆడాలని, జూన్ 24వ తేదీ నుంచి బర్మింగ్ హోమ్‌లో చివరి మ్యాచ్ ఉంటుందన్నారు.