వ్యాక్సిన్ వేసుకున్న పెళ్లి కొడుకు కావాలన్న వధువు.. ఈ యాడ్ వెనుక నిజం ఎంత..?

-

ఈ వ్యాక్సిన్ యాడ్ చాలా వైరల్ గా మారింది. కరోనా వైరస్ కారణంగా ఇటువంటి పరిస్థితి మనం చూడాల్సి వస్తోంది. డేటింగ్ యాప్ లో కూడా వ్యాక్సిన్ బ్యాడ్జెస్ ని మనం చూసాం. అయితే ఈ యాడ్ లో 24 ఏళ్ళ మహిళ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న పెళ్లి కొడుకు కావాలని మొత్తం రెండు డోసులు కూడా వ్యాక్సిన్ వేయించుకుని తీరాలి అని ఆ యాడ్ లో వుంది.

ఈ న్యూస్ పేపర్ యాడ్ కటౌట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్ ఎంపీ శశిధర్ దృష్టికి కూడా ఇది వెళ్ళింది. నిజంగా ఈ యాడ్ చాలా వైరల్ గా మారింది. ఫేస్బుక్ ద్వారా షేర్ చేసిన ఈ యాడ్ ఇప్పుడు ఎందరో మందిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ యాడ్ లో ఏ మాత్రం నిజం లేదు అని ఈ ఫేక్ యాడ్ ని 56 ఏళ్ల అతను క్రియేట్ చేసాడు.

అదే విధంగా అతను వాక్సినేషన్ సెంటర్ ఫోన్ నెంబర్ మరియు ఇతర వివరాలు కూడా దానిలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఇటువంటి యాడ్ ని పోస్ట్ చేశాడు.

కానీ ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అతనికి కోల్కత్తా, ఒడిస్సా ఇతర ప్రాంతాల నుండి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ పోస్టు చూసి కనీసం పది మంది వ్యాక్సిన్ వేయించుకున్న నేను సంతృప్తిగా ఉంటాను అని అతను అంటున్నారు.

అయితే ఈ ఫేక్ యాడ్ లో అతను తన ఫోన్ నెంబర్ ని ఇచ్చారు. దీంతో అతనికి ఎన్నో కాల్స్ వస్తున్నాయని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో నాకు దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ ని కోల్పోయానని అందుకని అందర్నీ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని మోటివేషన్ ఇస్తున్నాను అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news