కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ కు సంబంధించి నిన్న ఓ వివాదాస్పద ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. దీంతో టిఆర్ఎస్ పార్టీలో కొత్త అలజడి మొదలైంది. ఇప్పటికే ఈటల రాజేందర్ వ్యవహారంతోనే.. సతమతమవుతున్న.. టిఆర్ఎస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న విభేదాలపై ఈ ట్వీట్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై త్వరలోనే సిఎం కెసిఆర్ వేటు వేయనున్నారని ఆ ట్వీట్ పరమార్థం.
ఆ ట్వీట్ తో నిన్నటి రోజు మొత్తం అన్నీ ఛానెల్ లలో ఇదే వార్త. అయితే తాజాగా ఈ వివాదంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఇవాళ ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ మనుషులకు ఆలోచనలే ఉంటాయని అలాంటి విషయాలపై మాట్లాడాల్సిన అవసరం.. తనకు లేదని రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. పేదలందరికీ ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. త్వరలోనే మిగతా జిల్లాల్లో డయాగ్నోసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు. పిచ్చి పిచ్చి వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.