మరికాసేపట్లో ఉమ్మడి కరీంనగర్ కు కేసిఆర్… అసలు స్కెచ్ ఏంటి!

జగిత్యాల జిల్లాలో మరికాసేపట్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించనున్నారు సీఎం కెసిఆర్. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా రేగుంటకు చేరుకోనున్న సీఎం కేసీఆర్..మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సుమన్ స్వగ్రామం రేగుంటలోని సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. ఈ సందర్బంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. సుమన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

అయితే ఈటల ఎపిసోడ్ జరిగాక.. మొదటి సారిగా సిఎం కెసిఆర్ ఉమ్మడి కరీంనగర్ కు వస్తున్నారు. దీంతో తెలంగాణ మొత్తం సిఎం కెసిఆర్ పర్యటనపైనే దృష్టి సారించింది. బాల్క సుమన్ ను పరామర్శించడంతో పాటు.. ఎల్. రమణను పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరిపేందుకు ఈ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొన్న కేటీఆర్, ఇవాళ అధినేత జగిత్యాల జిల్లాకు వస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎల్. రమణ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకే సన్నద్దం అయినట్లు సమాచారం. ఇక ఎం జరుగుతుందో త్వరలోనే క్లారిటీ రానుంది.