మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ చాలా దూకుడుగా జరుగుతుంది. ఈ సిబిఐ విచారణలో కీలక వ్యక్తులను ఇప్పటి వరకు విచారించారు. అయితే విచారణకు వస్తున్న కొంత మంది విషయంలో మాత్రం ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు పై జిల్లా లో కొనసాగుతున్న విచారణలో అందరూ కూడా కొత్త వ్యక్తులు వస్తున్నారు.
నగరంలోని సెంట్రల్ జైలు కేంద్రంగా సాగుతున్న సిబిఐ విచారణలో నేడు కడప కు చెందిన ముగ్గురు వ్యక్తులు సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. ఈ ముగ్గురు కడప చెప్పుల డీలర్లు అయినట్లు తెలుస్తుంది. ఇక మున్నా అనే చెప్పుల షాపు ఓనర్ ను విచారించారు. ఆ షాపులో పని చేసే భాస్కర్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు విచారించారు. చెప్పుల షాపుల వాళ్ళను ఎందుకు విచారిస్తున్నారని జిల్లాలో చర్చలు జరుగుతున్నాయి.