పార్లమెంటు నియోజకవర్గాల వారీగా.. కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కొన్ని కొన్ని చోట్ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన ప్రకాశంజిల్లా ఒంగోలు పార్లమెంటు స్తానంలో ఇంచార్జ్ కోసంపార్లమెంటు నియోజకవర్గాల వారీగా.. కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కొన్ని కొన్ని చోట్ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన ప్రకాశంజిల్లా ఒంగోలు పార్లమెంటు స్తానంలో ఇంచార్జ్ కోసం ఇద్దరు నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. వీరిలో ఒకరు కనిగిరి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, మరొకరు యాదవ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన నూకసాని బాలాజీ. వీరిద్దరూ కూడా పార్టీకి కావాల్సిన వారే. పైగా ఒకరు ఓసీ, మరొకరు బీసీ వర్గాలకు చెందిన వారు. పార్టీ పట్ల విదేయతతో ఉన్నవారే.
వీరిలో ఇద్దరూకూడా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఉగ్రనరసింహారెడ్డి పైకి బాబుకే అంతా వదిలేసినట్టు చెబుతున్నా.. లోపాయికారీగా ఆయన ఈ పదవి కోసం ఒత్తిళ్లు పెంచుతున్నారని సమాచారం. గతంలో ఆయనకు డీసీసీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉంది. అందరినీ కలుపుకొని పోయే తత్వం కూడా ఉంది. అయితే, ఇప్పటికే బాపట్ల నియోజకవర్గం బాధ్యతలను ఓసీ వర్గానికే చెందిన నాయకుడికి కేటాయిస్తుండడంతో ఒంగోలును కూడా అగ్రవర్ణాలకే కేటాయిస్తే.. ఎలా అనే తర్జనభర్జనలు పార్టీలో నడుస్తున్నాయి.
అయితే ఈ పదవి కోసం ఉగ్రనరసింహారెడ్డి మాత్రం పట్టుబడుతున్నారని అంటున్నారు. మరోపక్క, బాలాజీ కూడా ఈ పీఠంపై కన్నేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇస్తామన్న చంద్రబాబు తనకు తప్పకుండా అవకాశం ఇస్తారని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఈయన పేరు కూడా బాబు పరిశీలనలో తీసుకున్నారు.
జిల్లాలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలంటే.. ఈయనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అయితే, ఉగ్రనరసింహారెడ్డి వంటి బలమైన నాయకుడికి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా సీనియర్లు చెబుతున్నారు. మొత్తానికి ఒంగోలు పీఠం కోసం నువ్వా నేనాఅనే రేంజ్‌లో సాగుతున్న పోరు.. మున్ముందు ఇబ్బంది లేకుండా సరిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-Vuyyuru Subhash