దేశంలో మరో సారి ఎన్నికల నగారా మోగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) బుధవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు జూలై 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూలై 19 న నామినేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.అదే రోజున కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించి ఫలితం కూడా వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ప్రతిపాదించే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.