తెలంగాణాలో ఆక్సీజన్ కొరత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇక నేడు కరోనా పరిస్థితిపై తెలంగాణా హైకోర్ట్ లో విచారణ జరగగా… ఆక్సిజన్, ఔషధాలపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి 35 శాతం కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారన్న తెలంగాణ వినతిని పరిగణనలోకి తీసుకున్నాం అని కేంద్రం తెలిపింది.
ప్రధాని ఆదేశాల మేరకు తెలంగాణకు కోటా పెంచాం అని తెలిపింది. ఆక్సిజన్ 450 మెట్రిక్ టన్నుల నుంచి 650 మెట్రిక్ టన్నుల పెంచాం అని వివరించింది. రెమెడివిసర్ ఇంజక్షన్లు 5 వేల నుంచి 10 వేలకు పెంచాం అని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు… రాష్ట్రానికి సహకరించాలి అని సూచించింది.